నవంబర్ 2024

దేశంలో పెరిగిన పాల ఉత్పత్తి తెలుసా?

దేశంలో పాల ఉత్పత్తి 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నుల నుంచి 2023-24లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. గతేడాది గేదెల పాల ఉత్పత్తి కన్నా 16% తగ్గినా, ఆవు పాల ఉత్పత్తి పెరగడంతో గతేడాది కన్నా 0.35 కోట్ల టన్నుల పాల దిగుబడి పెరిగింది.

నవంబర్ 26న ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశ్చిమవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రపంచంలోనే మన దేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

2022 23లో తలసరి పాల లభ్యత 459 గ్రాముల నుండి ఇప్పుడు 471 గ్రాములకు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో పాల ఉత్పత్తి సగటున రెండు శాతం పెరిగితే భారత్లో అది ఆరు శాతంగా ఉందని తెలిపారు.

పాల ఉత్పత్తిని పెంచేదాన్ని వైట్ రెవల్యూషన్ అంటారు.

భారత పాల విప్లవ కార్యక్రమం పేరు

ఆపరేషన్ ఫ్లడ్ మిల్క్ సిటీ ఆనంద్ నగరం గుజరాత్

ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

నవంబర్ 2024

అమెరికాకు జాతీయ పక్షి

  • November 26, 2024
అమెరికా సెనెట్ జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్’ను గుర్తించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ పక్షిని సుమారు 240 ఏళ్లుగా అమెరికాలో అధికార చిహ్నంగా వాడుతున్నారు.ఈ పక్షుల్ని