Telangana TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/ నుంచి TG TET హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. TET ఎగ్జామ్స్ జనవరి 2వ తేదీన ప్రారంభమై 20వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన TG TET తుది ఫలితాలను విడుదల చేయనున్నారు .
టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం:
- తెలంగాణ టెట్ అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో ‘ Hall Tickets Download 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Journal Number మరియు Date Of Birth వివరాలను అక్కడ పొందు పరచాలి.
- Proceed బటన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ ను సేవ్ చేసుకోండి.

టెట్ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,48,172 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు మొత్తం 71,655 దరఖాస్తులు & పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి.
మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి 11. 30 గంటల వరకు జరగనుంది.
రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 04. 30 గంటల వరకు జరగనుంది.
పరీక్ష రాసే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు.
Download Telangana TET Hall Ticket 2024
Also Read: AAI డిప్లొమా/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024