Daily Current Affairs Telugu – 4 December 2024
భారత స్క్వాష్ టీం మాజీ కెప్టెన్ బ్రిగేడియర్ రాజ్ కుమార్ మన్చందా ఇక లేరు
భారత స్క్వాష్ టీం మాజీ కెప్టెన్ బ్రిగేడియర్ రాజ్ కుమార్ మన్చందా డిసెంబర్ 3న మరణించారు.1977 నుంచి 1982 వరకు జాతీయ ఛాంపియన్ గా ఉన్నారు.తన కెరీర్లో ఓవరాల్గా 11 టైటిళ్లు సాధించారు.తన కెప్టెన్సీ లో కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్ లో భారత్ రజత పతకం సాధించింది.1984 ఆసియా చాంపియన్షిప్లో నాలుగో స్థానం నిలిచింది.టీం ఈవెంట్ లో కాంస్యం భారత్ గెలిచింది.1983లో ‘అర్జున అవార్డు’ పొందారు.
ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నీల్ ఫ్రేజర్ ఇకలేరు.
ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నీల్ ఫ్రేజర్(91) డిసెంబర్ 2న మరణించారు.డేవిస్ కప్ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను విజేత గా నిలబెట్టాడు.1959 లో యూఎస్ ఓపెన్లో . సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మూడు ట్రోఫీలు కైవసం చేసుకున్నార. 1960లో వింబుల్డన్ ఛాంపియన్ గా మరియు. 11 మేజర్ టైటిల్స్ (పురుషుల డబుల్స్) గెలిచారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 1984లో ‘టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు పొందాడు. 2008లో టెన్నిస్లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా భావించే ‘ఫిలిప్ చాట్రియెర్’ అవార్డును పొందారు.
హైబ్రిడ్ పద్ధతిలో 2025 మహిళల అంధుల టి20 ప్రపంచకప్
2025 లో మహిళల విభాగంలో జరిగే అంధుల టి20 ప్రపంచకప్ కు తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో పాకి స్తాన్ ఆడే మ్యాచ్లల్ని హైబ్రిడ్ పద్ధతిలో నేపాల్ లేదంటే శ్రీలంకలో నిర్వహించనున్నారు.పాకిస్తాన్ ముల్తాన్ వేదికగా జరిగిన ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.2027లో జరిగే పురుషుల విభాగపు అంధుల టి20 ప్రపంచకప్ వేదికను తర్వాతి వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు.భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్.భారత అంధుల క్రికెట్ సంఘం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీ సీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లకు అనుబంధ సంఘం కాదు.
మస్కట్ లో మహిళల జూనియర్ ఆసియా కప్ 2024
Oman రాజధాని మస్కట్ లో డిసెంబర్ 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. భారత కెప్టెన్ జ్యోతి సింగ్ భారత జట్టు ప్రస్తుత కోచ్ భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్.ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్-3 జట్లు) 2025 లోశాంటియాగో (చిలీ)లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తారు.
భారత కెప్టెన్ అవిలాష్ రావత్ కు imo పురస్కారం
2024జనవరి 26న ఎర్ర సముద్రము లో 84,147 టన్నుల నాఫ్తాను తీసుకెళ్తున్న ‘మార్లిన్ లువాండా’ నౌకను ఓ బాలిస్టిక్ క్షిపణి వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని భారత కెప్టెన్ అవిలాష్ రావత్ తన సిబ్బందితో నష్ట నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టాడు. దీనికి భారత కెప్టెన్ అవిలాష్ రావత్ కు 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం లండన్ నుండి పొందారు.అతడికి సహకరించిన కెప్టెన్ బ్రిజేష్ నంబియార్ మరియు భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విశా ఖపట్నం సిబ్బందికి ప్రశంస లేఖ పొందారు.
Daily Current Affairs Telugu – 4 December 2024
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ ఇకలేరు.
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ (76).వీరు ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1969 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.వీరు 2005 డిసెంబరు 12 నుంచి 2008 జులై 31 వరకూ సీబీఐ డైరెక్టర్గా పనిచేశారు.వీరు ఆరుషి హేమ్జ్ జంటహత్యల కేసు సమయంలో డైరెక్టర్ గా,గ్యాంగ్స్టర్ అబు సలెం, నటి మెనికా బేడీలను పోర్చుగల్ నుంచి భారత్కు తరలించే కేసు సమయంలో సీబీఐ అదనపు డైరెక్టర్ గా పని చేశారు.

Follow More Current Affairs: www.way2education.in/current-affairs/