TGPSC Chairman Burra Venkatesham: టీజీపీఎస్సీ నాలుగో చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ ఆమోదముద్ర వేశారు. దీనితో 30 నవంబర్ 2030 వరకు పదవిలో బుర్ర వెంకటేశం కొనసాగుతారు.
జనగామ జిల్లాలో గౌడ సామాజిక వర్గంలో 1968లో జన్మించిన బుర్ర వెంకటేశం. 1990లో సివిల్ సర్వీస్ తొలి ప్రయత్నంలో సాధించాడు. 1995లో సివిల్ సర్వీసులో జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు.

గతంలో చేపట్టిన పదవులు
1.ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్,2.రంపచోడవరం, రాజమండ్రి సబ్ కలెక్టర్,3.వరంగల్ మున్సిపల్ కమిషనర్,4.చిత్తూరు, గుంటూరు జిల్లాలజాయింట్ కలెక్టర్, 5.మెదక్,గుంటూరు జిల్లాల కలెక్టర్ 6.ఐటీ శాఖడైరెక్టర్,7.మెడికల్, టూరిజం కార్పొరేషన్ల ఎండీ, 8.హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ. 9.2014లోతెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, 10.సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ , 11.బీసీసంక్షేమశాఖముఖ్యకార్యదర్శి, 12.ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌కమిటీ సభ్యుడు.
ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీగా ఉన్నారు.
రచయితగా సెల్ఫీ ఆఫ్ సక్సెస్ ఆంగ్ల పుస్తకం , గెలుపు పిలుపు, జీవనధన్య శతకం, బుద్ధంకరణం గచ్ఛామి, రామాయణ పరివారము, అనుబందాల పూదోట వంటి పుస్తకాలు రచించాడు.