డీఎస్సీ -DSC

నూతన జాతీయ విద్యా విధానం 2020

National Education Policy 2020: పరిచయం

1950 జనవరి 26న మనం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్- 45 ప్రకారం 6- 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య కల్పించాలని ఉంది కాని అమలుకాలేదు.రాజ్యాంగ రచనకు ముందే మన స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య ప్రస్తావనను తెచ్చారు.ప్రాధమిక విద్య బాలలకు వారి ఎదుగుదలకు మానసిక వికాసానికి తోడ్పడేలా ఉండాలని ఎంతో మంది మేధావులు స్వాతంత్ర్యం అనంతరం ఈ క్రింది కమిటీల ద్వారా ప్రస్తావనలో తెచ్చారు.

వివిధ కమిటీలు- 1. రాధాక్రిష్ణ కమిటీ– 1948 విశ్వవిద్యాలయాల కమీషన్గా పేరుగాంచింది. విద్యను మొదట్లో రాష్ట్ర జాబితాలోనే చేరుస్తూ ప్రాధమిక విద్య రాష్ట్రాలు సమర్ధవంతంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 2. మొదలియార్ కమీషన్- కమీషన్ / సెకండరీ విద్యా కమీషన్( 1952) కూడ ప్రాధమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చినా సరిగ్గా అమలుకాలేదు.

3. దౌలత్ సింగ్ కొఠారీ కమిటీ( 1964) తొలి జాతీయ విద్యా విధానం( 10 +2+ 3) గా అమలు చేయడం జరిగింది. స్వాతంత్ర్యం తరువాత మన దేశంలో ఏర్పడిన మొదటి విద్యా కమీషన్ దేశవ్యాప్తంగా 1966న తన నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా మన దేశంలో ఉన్న మొట్టమొదటి National Education Policy- 1968 ఏర్పాటు అయినది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం( మిని రాజ్యాంగంగా పిలిచే లేదా అతిపెద్ద రాజ్యాంగ సవరణగా పేరుగాంచిన) చేసిన 42వ రాజ్యాంగ సవరణ( 1976) ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు.

4. National Education Policy – 1986 * నూతన జాతీయ విద్యా విధానం 1986ను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా 21వ శతాబ్ధంలో మన దేశంలో యువత విద్యారంగంలో వచ్చే సవాళ్లను సమస్యలను మిగతా ప్రపంచంతో పోటీ పడేలా విద్యా సంస్కరణలు రూపొందించాలని కమిటీని ఏర్పాటుచేశారు. * కమిటీ చైర్మన్N.జనార్ధన్ రెడ్డి( ఆ నాటి కేంద్ర విద్యాశాఖమంత్రి- పి.వి.నరసింహారావు) విద్యారంగంలో సవాళ్లు- భవిష్యత్తు- * విద్యారంగంలో సవాళ్లు- భవిష్యత్తు- అనే పేరుతో National Education Policy- 1986 అమలయింది. ఇది 1986 నుండి 2020 వరకు సమారు 34 సంవత్సరాలకు పైగా అమలయింది. అనేక రంగాలలో ఈ కమిటీ సిఫార్సులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు కలిగించాయి. ముఖ్యంగా విద్యారంగంలో 21వ శతాబ్దపు భారతీయ యువతను ప్రపంచము ఎదుట నిలబెట్టెలా చేసింది. అయితే మారుతున్న సమాజానికి తగినట్లుగా నేటి విద్యారంగం కి అనుగుణంగా యువత నిలిచేలా ప్రస్తుత ప్రభుత్వం NEP- 1986 ను పునః సమీక్షించి నూతనంగా రూపకల్పన చేయాలని నిర్ణయించుకుంది.

National Education Policy 2020 ఏర్పాటు

  • 2015న NDA ప్రభుత్వంలో ఆనాటి మానవ వనరుల శాఖమంత్రి ‘స్మృతి జుబేదా ఇరానీ, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి అయిన T.S.R Subramanyam అధ్యక్షతన CENEP (Committee for the Evoluation of The New Education Policy) ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2016న ఒక డ్రాఫ్ట్ కాపీ తయారు చేశారు.

34 సంవత్సరాలుగా అమలులో ఉన్న జాతీయ విద్యా విధానంను ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా అనేక మార్పులు అవసరమని భావించిన ప్రభుత్వం CENEP డ్రాఫ్ట్ కాపీలోని అంశాలను పూర్తిగా పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాలని ఇస్రో మాజీ చీఫ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన డా॥ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 8 మంది సభ్యులు మరియు ఒక కార్యదర్శితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

డా॥ కృష్ణస్వామి కస్తూరి రంగన్

1994 నుండి 2003 వరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కి చైర్మన్ గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ (1982), పద్మభూషణ్ (1992) మరియు పద్మవిభూషణ్ (2000) పౌర పురస్కారాలు పొందారు.

National Education Policy 2020

National Education Policy 2020 సభ్యులు

1.మహేష్ చంద్ర పంత్: NIEPA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్) యొక్క ప్రస్తుత ఛాన్సలర్

2. గోవింద్ ప్రసాద్ శర్మ: నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్.

3 నజ్మా అక్తర్: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ

4. టీవీ కట్టిమణి:సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (CTUAP) తొలి వైస్-ఛాన్సలర్ మరియు కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు-రెండవ అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటకలో ఉన్నత విద్యకు విశేష కృషికి లభించింది.

5. మిచెల్ డానినో: ఫ్రెంచ్ మూలానికి చెందిన భారతీయ రచయిత. గాంధీనగర్‌ ఐఐటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2017లో, సాహిత్యం & విద్యలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

6.మిలింద్ కాంబ్లే:మిలింద్ కాంబ్లే ఒక భారతీయ పారిశ్రామికవేత్త మరియు 2013లో పద్మశ్రీ గ్రహీత. జమ్మూలోని IIM చైర్‌పర్సన్.

7. జగ్బీర్ సింగ్:ప్రొఫెసర్ (డా.) జగ్బీర్ సింగ్, మాజీ ప్రొఫెసర్ మరియు HoD, పంజాబీ డిపార్ట్‌మెంట్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, భటిండాలోని పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీకి కొత్త ఛాన్సలర్‌గా .

8. మంజుల్ భార్గవ: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు. 2014లో ఫీల్డ్స్ మెడల్ అందుకున్నాడు.

9. MK శ్రీధర్: శిక్షకుడు మరియు సామాజిక కార్యకర్త . కర్ణాటక ప్రభుత్వం ద్వారా కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు మరియు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌తో సత్కరించింది.అతను కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ మరియు కర్ణాటక స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ప్రభుత్వ సభ్య కార్యదర్శిగా పనిచేశాడు. కర్ణాటక మరియు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (CABE), MHRD సభ్యుడు.

10.ఝింగ్రాన్ ప్లాంట్:డాక్టర్ ధీర్ ఝింగ్రాన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ ఫౌండేషన్ (LLF) వ్యవస్థాపక డైరెక్టర్, ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల పునాది అభ్యాసాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. గతంలో, IAS అధికారిగా, ధీర్ అస్సాం ప్రభుత్వంతో విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీగా, విధాన రూపకల్పన పాత్రలలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా మరియు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

11. శంకర్ మరువాడ: EkStep ఫౌండేషన్‌లో సహ-వ్యవస్థాపకుడు మరియు CEO మరియు అతను ఒక వ్యవస్థాపకుడు మరియు మార్కెటింగ్ నిపుణుడు మరియు భారతదేశ జాతీయ గుర్తింపు కార్యక్రమం అయిన ఆధార్ వంటి భారీ స్థాయి ప్రాజెక్ట్‌లలో విస్తృత శ్రేణిలో పనిచేసిన అనుభవం కలదు.డిమాండ్ జనరేషన్ మరియు మార్కెటింగ్ హెడ్‌గా పని చేశారు. .

Also Read: తెలంగాణ రాష్ట్ర గీతం

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Telangana DSC Previous Papers 2024:
డీఎస్సీ -DSC

Telangana DSC Previous Papers 2024 PDF Download Here

Telangana DSC Previous Papers 2024: తెలంగాణ వ్యాప్తంగా DSC పరీక్ష 18 జూలై నుండి 5 ఆగస్టు 2024 వరకు ప్రతిరోజూ 2 షిఫ్ట్‌లు జరిగాయి.